calender_icon.png 12 January, 2026 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల సృజనాత్మకతకు ప్రతిబింబం

12-01-2026 02:35:21 AM

మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

ఖైరతాబాద్, జనవరి 11 (విజయక్రాంతి) : ముగ్గులు మహిళల సృజనాత్మకతకు ప్రతిబింబం అని ఖైరతాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి అన్నారు. హిమాయత్ నగర్ డివిజనులోని జైస్వాల్ లైనులో ఆదివారం జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీకి ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. బిజెపి నాయకుడు కొయ్యడ నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది ముగ్గుల పోటీని నిర్వహించడం అభినందనీయమన్నారు. తద్వారా మహిళల్లోని ప్రతిభను వెలికి తీసే వీలు కలుగు తుందన్నారు. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొ న్న ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.  తెలుగు వారికే ప్రత్యేక మైన పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి హిమాయ త్ నగర్ డివిజన్ అధ్యక్షురాలు మాధవి, నాయకుడు పందిళ్ల ప్రసాద్ తదితరులున్నారు.