05-01-2026 12:00:00 AM
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి
చిన్న చింతకుంట, జనవరి 4 : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అమ్మాపూర్ గ్రామంలో హైదరాబాద్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ (హాకా)వారి రైతు సేవ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు పండించిన వరి ధాన్యానికి క్వింటాలకు రూ.500 బోనస్ ఇస్తూ ప్రోత్సహిస్తుందన్నారు.
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వం ఇస్తున్న హామీలను నెరవేరుస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కథలప్ప, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజారాంభూపాల్, అమ్మాపూర్ కురుమూర్తి సర్పంచులు రంజిత్ కుమార్, కురుమన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.