calender_icon.png 20 September, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంచిలో మృతదేహం కేసులో పోలీసుల పురోగతి

20-09-2025 05:15:22 PM

హైదరాబాద్‌: చర్లపల్లి రైల్వే స్టేషన్(Charlapalli Railway Station) వద్ద సంచిలో మృతదేహం కేసులో శనివారం పోలీసులు పురోగతి సాధించారు. మృతురాలు బెంగాల్ కు చెందిన ప్రమీలగా గుర్తించారు. భర్తతో గొడవల కారణంగా ప్రమీల కొన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంటుంది. బెంగాల్ కు చెందిన ఓ యువకుడితో ఇటీవల పరిచయం పెంచుకున్న ప్రమీల.. అతనితో కలిసి కొండాపూర్ లో నివసిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా, నిందితుడు ప్రమీలను చంపి మృతదేహాన్ని మూట కట్టి 37 కిలోమీటర్లు తీసుకుని వచ్చి చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ ప్రక్కన పడేశాడు. అనంతరం రైల్వే స్టేషన్ వెయిటింగ్ హల్లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకున్న నిందితుడు.. అస్సాంకు వెళ్లే రైలు ఎక్కి పరారయ్యాడు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.