calender_icon.png 18 October, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తన్విశర్మకు ఖాయమైన పతకం

18-10-2025 12:51:16 AM

-బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్

గుహావటి,అక్టోబర్ 17: బీడబ్ల్యూఎఫ్ వర ల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్, యువ సంచల నం తన్వి శర్మ మెడల్ ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్‌లో తన్వి శర్మ సెమీఫైనల్‌కు దూసుకెళ్ళిం ది. వ్య క్తిగత విభాగంలో తన్వి మాత్రమే ముందంజ వేసింది.హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైన ల్లో తన్వి 13 స్కోర్ తో జపాన్ ప్లేయర్ సాకి మసుమోటో పై విజ యం సాధించింది. తొలి గేమ్ కోల్పో యి వెనుకబడినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పో ని ఈయువ సంచలనం అద్భుతంగా పుంజుకుని రెండో గేమ్ గెలిచింది.

ఇక మ్యా చ్ ఫలి తాన్ని తేల్చే మూడో గేమ్ కూడా ను వ్వా నే నా అన్నట్టు సాగింది.అయితే చివర్లో జపాన్ ప్లేయర్‌పై ఆధిక్యం నిలుపుకుంటూ తన్వి విక్ట రీ అందుకుంది. సెమీస్‌లో ఓడినా తన్వికి కాంస్య పతకం దక్కుతుంది. మరో ప్లేయర్ ఉన్నతి హుడా క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిం ది. థాయ్‌లాండ్‌కు చెం దిన రెండో సీడ్ అన్యపాట్ చేతిలో ఉన్నతి 12 స్కోర్‌తో పరాజయం పాలైంది. మిక్సిడ్ డబుల్స్‌లో భవ్య జోడీ పోరాటం కూడా క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. చైనీస్ తైపీకి చెందిన హుంగ్ జోడీ చేతిలో 15 15 స్కోర్‌తో ఓడిపోయింది.