16-08-2025 04:54:09 PM
సీపీఎం టౌన్ కార్యదర్శి దొంతు సోమన్న..
మరిపెడ (విజయక్రాంతి): స్థానిక మున్సిపాలిటీ కేంద్రంలోని తొమ్మిదవ వార్డులో బీరువాల జగదీషు గల్లీలో ఉన్న రోడ్డు పూర్తిగా నీటిమయంతో ఉన్నదని సిపిఎం టౌన్ కార్యదర్శి దొంతు సోమన్న(CPM Town Secretary Donthu Somanna) అన్నారు. ఈ బజార్లో మున్సిపాలిటీ వాళ్లు తట్టేడు మట్టి పోసిన పాపన పోలేదని అన్నారు. ఈ బజార్లో రోడ్లు, వీధిలైట్లు లేవని వాపోయారు, ఇప్పటికైనా మున్సిపాలిటీ కమిషనర్ స్పందించి, ఈ వార్డులో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం పక్షాన ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓర ఉపేంద్ర, ధనలక్ష్మి, దొంతు మమత, నరేష్ తదితరులు పాల్గొన్నారు.