calender_icon.png 16 August, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ఈదులూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

16-08-2025 04:57:31 PM

నకిరేకల్,(విజయక్రాంతి): కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఆదివారం  లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్  కింగ్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత  కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆ క్లబ్ అధ్యక్షుడు చిక్కు శేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి (లేజర్ సెంటర్) సహకారంతో గ్రామంలో ఉదయం 9-00 గంటల నుంచి మధ్యాహ్నం 1-00 గంట  వరకు ఈదులూరు  గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్య కంటి వైద్య శిభిరం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరం లో ఉచితంగా కంటి పరీక్షల చేసి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని ప్రత్యేక బస్సు లో సూర్యాపేట లయన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి  ఉచితంగా ఆపరేషన్ చేస్తారని  ఆయన తెలిపారు.కంటి చుక్కల మందులు, అద్దాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని.  మండల, గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.