calender_icon.png 17 January, 2026 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగవంతంగా ఇండ్లు నిర్మించుకోవాలి

17-01-2026 02:12:50 AM

తాడ్వాయి, జనవరి, 16( విజయ క్రాంతి ): ఇందిరమ్మ ఇండ్లు వేగవంతంగా నిర్మించుకోవాలని ఎంపీడీవో సాజిద్ అలీ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం గ్రామంలో ఆయన శుక్రవారం ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తుందని తెలిపారు. ప్రతి ఇల్లు లేని లబ్ధిదారుడు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొని లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్, ఎం ఎస్ ఓ రఘు, సిపిఓ నరేందర్ పాల్గొన్నారు