calender_icon.png 28 December, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటక ప్రాంతంగా ‘పూసుకుంట’

28-12-2025 12:48:46 AM

  1. కొండ రెడ్ల కుటుంబాల అభివృద్ధికి కృషి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అశ్వారావుపేట, డిసెంబర్ 27 (విజయక్రాంతి):  కలెక్టర్, ఐటీడీఏ పీవో అన్ని శాఖల అధికారులతో నెలవారి మాస్టర్ ప్లాన్ తయారుచేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టి పూసుకుంట గ్రామాన్ని పర్యాటక ప్రాంతం గా తీర్చిదిద్దాలని వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌిళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం  దమ్మపేట మండ లం పూసుకుంట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు.

కొండరెడ్ల గిరిజనుల కుటుంబాలతో పాటు ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న గుత్తి కోయ కుటుంబాలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిం చాలని, విద్య, వైద్యం, వ్యవసాయం అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఐటీడీఏ ఆధ్వర్యంలో చేయూత అందించాలని, కొండరెడ్ల గిరిజన కుటుంబాల అభివృ ద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి ద్వారా  ప్రత్యేక నిధు లు మంజూరు చేయిస్తానని అన్నారు. ముఖ్యంగా ఈ గ్రామంలో సబ్ సెంటర్ నిర్మాణం, అంగనవాడీ భవనం, పాఠశాల భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భూముల వివరాలు, చిన్న పిల్లలకు హెల్త్ కార్డులు, జీవిత బీమా సౌకర్యం అలాగే మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. కొండరెడ్ల కుటుంబాలు కోరిన విధంగా ఏప్రిల్ వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని, సబ్ సెంటర్ నిర్మాణం గ్రామపంచాయతీ భవనం పామాయిల్ మొక్కల పెంచుకునే కుటుంబాలకు బోరు సోలార్ తో కరెంటు సౌకర్యం కల్పిస్తామని, ఇందిరమ్మ ఇండ్లు రాని కుటుంబాలకు త్వరలో అందరికీ ఇండ్లు వచ్చేలా చూస్తామన్నారు.

అనంతరం 18 మంది కొండ రెడ్ల గిరిజన రైతులకు 75 ఎకరాలలో పామాయిల్ మొక్కలు పెంచుకోవడానికి ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో పామాయిల్ మొక్కలు నాటి, ఊట్ల రాజారెడ్డి పొలంలోని డ్రిప్ ఇరిగేషన్ మోటారు ప్రారంభించారు. ఒక కోటి 5 లక్షల రూపాయల విలువగల జన్మన్ పథకం కింద శాంక్షన్ అయిన ఇండ్లకు సంబంధించిన అర్హత పత్రాలు 18 మంది కొండ రేడ్ల గిరిజనులకు అందించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేశారు.

కరెంటు మోటార్లు, తైవాన్ స్ప్రే మిషన్లు, రెండు ఫ్లోర్ మిల్స్ మిషన్లను మరియు సెల్ఫీ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఇందిరమ్మ చీరలు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ పాల్గొన్నారు.