calender_icon.png 19 January, 2026 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారిపై ట్రాక్టర్ బోల్తా తప్పిన పెను ప్రమాదం

10-11-2024 04:44:31 PM

అనంతగిరి (విజయక్రాంతి): రహదారిపై ధాన్యం లోడు ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని చనుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రైతుల వివరాల ప్రకారం చన్నుపల్లి నుండి త్రిపురవరానికి వెళుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడినట్టు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ కు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని ప్రాణాలతో బయటపడినట్టు తెలిపారు. ట్రాక్టర్ పొలంలో బోల్తా పడడంతో ధాన్యం నేలపాలై తీవ్ర నష్టం జరిగిందని రైతు కొత్త లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.