calender_icon.png 19 January, 2026 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

10-11-2024 04:40:17 PM

చేర్యాల (విజయక్రాంతి): కార్తీక మాసం, ఆదివారం రెండు కలిసి రావడంతో మల్లన్న ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి సుమారు రెండు గంటల వరకు సమయం పట్టింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి పట్నం వేసి, బోనం సమర్పించుకున్నారు. అదేవిధంగా గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం చెల్లించి నైవేద్యం సమర్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో బాలాజీ, సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు.