calender_icon.png 19 November, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రెండీ లవ్‌స్టోరీ మొదలైంది

16-11-2025 12:00:00 AM

సంగీత్‌శోభన్ హీరోగా ఓ కొత్త చిత్రం రాబోతోంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్న ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో వహించనున్నారు. ఈ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ ప్రారంభోత్సవంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నిర్మాత ఎస్‌కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. సరికొత్త ట్రెండీ లవ్‌స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుండగా దీనికి లక్ష్మీ భూపాల్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.