23-10-2025 11:45:24 PM
తెల్లవారుజాము వరకు జనంతో కిక్కిరిసిన రోడ్లు
ముషీరాబాద్ (విజయక్రాంతి): ముషీరాబాద్ లో సదరు ఉత్సవాలు తెల్లవారుజాము వరకు అంగరంగ వైభవంగా కొనసాగాయి. డప్పుల దరువులు, యువతుల నృత్యాలు, కళాకారుల ప్రదర్శనలు, దున్నపోతులు విన్యాసాలతో సదరు ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర సదరు ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సదరు వేడుకల్లో హరియానా రాష్ట్రానికి చెందిన గోలు, భజరంగి, బాద్, కోహినూరూ, పంజాబ్ రాష్ట్రానికి చెందిన రోలాక్స్ తదితర భారీ దున్నలు సదరు వేడుకల్లో ఆకర్షనీయంగా నిలిచాయి. దున్నరాజుల విన్యాసాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం రావడంతో రోడ్లన్ని కిక్కిరిసి పోయాయి. ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై దున్నలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు వరుణ్, అభినందన్, సాయి, సయ్యద్ అహ్మద్ భక్తియార్, ఖధీర్, సదా తదితరులు పాల్గొన్నారు.