23-10-2025 11:43:07 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): భోలక్ పూర్ గాంధీనగర్ కు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎంఎన్. శ్రీనివాస్ రావు గురువారం ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునిత ఘన విజయం సాధించేలా ఇంటింటా ప్రచారం చేస్తున్నామని ఎమ్మెన్ శ్రీనివాసరావు తెలిపారు. జూబ్లీహిల్స్ లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని పేర్కొన్నారు.