calender_icon.png 24 October, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ కబ్జాలూ వెలుగులోకి వస్తేగాని..?

24-10-2025 12:36:02 AM

వదలని సింగరేణి అధికారుల మొద్దునిద్ర..

బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 23 : సహజం గా సింగరేణి సంస్థ ఆస్తులు, వనరులను కాపాడుకునేందుకు ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.. కానీ బెల్లంపల్లి ప్రాంతంలో సింగరేణి అధికారుల వ్యవహార శైలి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కబ్జాలు జరుగుతున్నప్పుడు పట్టించుకోవడం మాని పత్రికల్లో కబ్జాలు జరుగుతున్నాయని వార్తలు ప్రచురిస్తే కానీ స్పందన కానరావడం లేదు.

కబ్జాలు వెలుగులోకి రాకుండా, కోట్ల రూపాయలు విలువ జేసే సింగరేణి భూముల కబ్జా లు జరిగినా, అవి చేతులు మారినా బారకున్ మాఫీ అన్నట్లే..? ఇలా సింగరేణి అధికారులు ఇప్పటికీ కోట్లు విలువైనా సింగరేణి సంపదను అక్రమార్కుల పాలు చేశారు. సింగరేణి అధికారుల మొద్దు నిద్రకు ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. ఈ విషయం తరచుగా బయట పడుతూనే ఉంది.

దాన్నికప్పిపుచ్చుకోవడానికి అధికారులు చేసే హంగామా, హడావుడి అంతాఇంతా  కాదు. సింగరేణి కార్పోరేట్ ఆపీస్ నుంచి ఆదేశాలు రావడం, అక్షింతలు పడితేగాని ఎస్టేట్, సెక్యూరిటీ విభాగాల  అధికారులు రంగంలోకి దిగరు. పత్రికల్లో ప్రచురితమైన తర్వాత అధికారులు, సిబ్బంది కబ్జా స్థలాన్ని వెతికి  స్వాధీనం చేసుకోవడం, హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పా టు చేయడం ఇప్పటికీ నడుస్తున్న తంతు. ఆ మేరకు ఆ ఘట్టం అంతటితో ముగుస్తోంది. ఇక వారి బాధ్యత తీరిపోతది. ఇలా అధికారులు చేతులు దులిపేసుకోవడం సింగరేణి లో ఆనవాయితీ నడుస్తోంది. 

‘విజయక్రాంతి’లో వరుస కథనాలు...

బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి భూము ల్లో అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణాలపై ‘విజయక్రాంతి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం విధితమే... ఈ భూ కబ్జాల కథనాలపై సింగరేణి అధికారులు స్పందించారు. ఈ నెల 22న ‘సింగరేణి భూము ల్లో రియల్ దందా’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి యాజమాన్యం స్పందిం చింది. బెల్లంపల్లిలోని  85డిప్ లో జరుగుతు న్న భూ అక్రమణ, అక్రమ షెడ్లను సెక్యూరిటీ ఎస్టేట్ అధికారులు రామారామీగా వెళ్లి కూల్చి వేశారు. హద్దుల కోసం  వేసిన సిమెం ట్ ఫోళ్ళను  తొలగించారు.

అలాగే ఇటీవలనే మూతపడిన సౌత్ క్రాస్ కట్ బొగ్గు గని ఆనుకొని ఉన్న అత్యంత విలువైన సింగరేణి భూముల కబ్జాపై ‘విజయక్రాంతి’ దినపత్రికలో ‘సింగరేణి భూములకు రక్ష ణ కరువు..’ శీర్షికతో వార్తతో వెలుగు చూసిన భారీ భూకబ్జాలు తెలిసిందే. ఆ వార్తకు స్పందించిన అధికారులు కబ్జాపై ఉక్కుపాదం మోపారు. కబ్జాకు గురైన స్థలం సుమారుగా 5 ఎకరాలు లోపు ఉంటుంది. ఖాళీగా ఉన్న సింగరేణి భూమిని కాజేయాలను చేసిన కబ్జాకోర్ల  పన్నగాలను సింగరేణి అధికారులు తిప్పికొట్టారు. దేవుళ్ల పేరుతో కొత్త రూపంలో భూ అక్రమాలకు తెర తీశారు.

ఈ భూకబ్జాలపై బెల్లంపల్లిలోని ప్రతిపక్ష, అఖిలపక్ష కార్మిక సంఘాలు, పార్టీల శ్రేణులు స్పందించారు. అడ్డుకునేందుకు ఒక్కటయ్యారు. అడ్డుకున్నా రు. అంతేకాకుండా బెల్లంపల్లిలో భూకబ్జాలపై ఆందోళన కోసం పట్టణ పరిరక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసి మందమర్రి జీఎం రాధాకృష్ణ ను కలసి ఫిర్యాదు చేశారు. ఈ ఘట్టం మరవకముందే పట్టణ లోని 85 డీప్ లో మరో భారీ భూ కబ్జా వైనం చోటు చేసుకోవడం చర్చనీయాంశగా మారింది. భూ అక్రమణలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా నిర్దిష్టమైన, చిత్తశుద్ధితో ఓ విధానాన్ని అమలు చేసి సింగరేణి భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.