23-10-2025 11:46:59 PM
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ముషీరాబాద్ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునితకు మద్దతుగా గురువారం ముషీరాబాద్ డివిజన్ కు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు షేక్పేటకు తరలివెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పి. శ్రీధర్ చారి, పూస గోరఖ్ నాథ్, ఎయిర్టెల్ రాజులు కరపత్రాలు పంచుతూ సునితను గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో బీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ బీఆర్‌ఎస్ నాయకులు ఇమ్రాన్, మహబూబా ఖాన్, సత్యనారాయణబాబు తదితరులు పాల్గొన్నారు.