calender_icon.png 2 August, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి

25-07-2025 12:24:11 AM

బీజేపీ కిసాన్ మోర్చా ప్రతినిధుల జేసీకి వినతి

కామారెడ్డి అర్బన్, జూలై 24 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు బండారి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ  రుణమాఫీ కాని రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలనీ, పది రకాల పంటలకు వరిధాన్యం, మొక్కజొన్న, కందులు, సోయాబీన్స్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు 500 రూపాయలు బోనస్ చెల్లించాలనీ, రైతులకు ప్రతి ఎకరానికి పదిహేనువేల రూపాయలు ప్రతి సంవత్సరానికి రైతు భరోస చెల్లిచాలనీ అన్నారు, రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ భీమాను అమలు

చేయాలనీ కోరారు, నకిలి విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకొనుటకు ప్రతి జిల్లాలో ఒక I.P. s స్థాయి అధికారి స్థాయిలో విజిలెన్స్ లో మానిటేరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలనీ కోరారు,  సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందించాలని డిమాండ్ చేశారు.  పండ్ల తోటల రైతులను ఆదుకోవాలనీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీనివాస్, కాసర్ల రవీందర్, భారతీయ కిసాన్ మోర్చా ప్రతినిధులు పాల్గొన్నారు.