27-11-2025 12:46:48 AM
బావి వద్ద సూచిక బోర్డు కల్వర్టు నిర్మించాలని వాహనదారుల విజ్ఞప్తి
మరిపెడ,నవంబర్26 (విజయక్రాంతి) మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండా, గిరిపురం శివారు గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే మూల మలుపు వద్ద వ్యవసాయ బావి వాహనదారులకు,ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. గిరిపురం ఎక్స్ రోడ్ గ్రామం నుండి మహబూబాబాద్ జిల్లా కు వెళ్లే ప్రారంభంలోనే మూలమలుపు ప్రమాదంగా మారిందని, అదికాక మూల మలుపును అనుకొని పెద్ద వ్యవసాయ బావి అతి భయంకరంగా ఉండడం,
ప్రమాదాలకు తావిస్తుందని, ప్రమాదాలు జరగకముందే అధికారులు మేల్కొని, మూలమలుపు వద్ద, వ్యవసాయ బావి వద్ద గోడను నిర్మించి, ప్రమాదాలను నివారించాలని, రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులకు తెలిసే విధంగా మూలమలుపు వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని,ఆర్ అండ్ బి అధికారులను, జిల్లా అధికారులను, మండల అధికారులను, వాహనదారులు, ప్రయాణికులు వేడుకుంటున్నారు.