27-11-2025 12:46:38 AM
జడ్చర్ల, నవంబర్ 26: రామస్వామి గుట్ట తండా ప్రజల కల సాకారం కొత్తగా 3.6 కిమీల బీటీ రోడ్డు మంజూరు తీరిపోనున్న తరతరాల కష్టం. పెద్దదిరాల నుంచి చిన్న రేవల్లి వరకు కొత్త బీటీ రోడ్డు రోడ్డు నిర్మాణానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించరని,కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన అనిరుధ్ రెడ్డి జడ్చర్ల మండలంలోని రామస్వామి గుట్ట తండా ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర పడిందని,సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి వెల్లడించారు.
రామస్వామి గుట్ట తాండాకు బిటి రోడ్డు మంజూరు చేయాలని తాను చేసిన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారని బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు.పెద్దదిరాల నుంచి రామస్వామి గుట్ట తండా మీదుగా చిన్న రేవల్లి వరకు మొత్తం 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు ను మంత్రి కోమటిరెడ్డి మంజూరు చేశారని చెప్పారు.ఈ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు రాజకీయం పక్కనబెట్టి నిరంతరం పాటుపడుతున్నామని చెప్పరు.ఇప్పటికే పెద్ద చెల్క తండా రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.వాటితో పాటుగా రామస్వామి గుట్ట తాండ రోడ్డు పనులు కూడా ప్రారంభం అవుతాయని చెప్పారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌకర్యాలు అందించడం తన సంకల్పమని స్పష్టం చేశారు.
రానున్న రోజుల్లో మరిన్ని తండాలకు రహదారి మంజురులు తెచ్చేందుకు కృషి చేసి,తండాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, ప్రతి గ్రామంప్రతి తండా అభివృద్ధే తమ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.