18-12-2025 02:02:07 AM
ఎస్సై తలకు గాయాలు, వాహనాలు ధ్వంసం
ఆదిలాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాం తి): ఆదిలాబాద్ జిల్లా సీతాగొంది గ్రా మం లో బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినప్పటికీ, కౌంటింగ్ ప్రక్రియలో మాత్రం ఆందోళన నెలకొంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేం ద్రం వద్ద గుమ్మగిడిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు.
ప్రజ లు పరుగులు తీసే క్రమంలో ఒక రు మురికి కాలువలో పడటంతో కాలు విరి గి, తీవ్ర గాయాలయ్యాయి. ఆగ్రహించిన గ్రామస్థు లు పోలీసులకు ఎదురుతిరిగి, కొందరు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఎస్సై పురుషోత్తం తలకు గాయాలు కాగా, పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం ఆయ్యాయి.