14-09-2025 01:44:44 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): విద్యాలయ ప్రాంగణాన్ని డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చేశా రు. హైదరాబాద్ నగరం బోయిన్‌పల్లిలోని మూతపడిన మేధా స్కూల్ మొదటి అంతస్తులో పిల్లల పుస్తకాలు, సామగ్రి పక్కనే భారీ ఎత్తున అల్ఫాజోలం తయారీ యూనిట్‌ను నడుపుతున్నారు.
శనివారం ఎక్సైజ్ శాఖ, ఈగల్ టీం మెరుపుదాడితో ఈ గుట్టురట్టయింది. మహబూబ్‌గర్ జి ల్లాకు చెందిన స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్‌గౌడ్ డబ్బు ఆశతో ఈ దందా కు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఈగల్ టీం జయప్రకాశ్‌తో సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇలా డ్రగ్ ఫ్యాక్టరీ వెలుగులోకి
బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ, ఈగల్ టీంకు పక్కా సమాచారం అందింది. గత కొంత కాలంగా ఈ ప్రాం తంలో అనుమానాస్పద కదలికలు, రసాయనాల వాసన వస్తున్నట్లు స్థానికులు చెపుతు న్నారు. ఈ సమాచారం ఆధారంగా శనివారం ఈగల్ టీం ఆకస్మిక దాడి చేసింది.
అధికారులు లోపలికి ప్రవేశించగానే నిర్వాహకులు షాక్‌కు గురయ్యారు. స్కూల్ మొదటి అంతస్తులో ఒకవైపు పిల్లల పుస్తకాలు, పాఠశాల సామగ్రి ఉండగా, పక్కనే ఎనిమిది పెద్ద రియాక్టర్లు, భారీగా రసాయనాలు, ఇతర తయారీ యంత్రాలు, మత్తు పదార్థా లు నిల్వ చేయబడి ఉన్నాయి. ఇది పాఠశాలను కాకుండా, ఒక పూర్తిస్థాయి డ్రగ్ ఫ్యాక్టరీని తలపించేలా ఉందని అధికారులు నిర్ధారించారు.
జయప్రకాశ్ గౌడ్ చీకటి దందా
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మలే లా జయప్రకాశ్‌గౌడ్.. మేధా స్కూల్ యజమాని. సుమారు సంవత్సరం క్రితం శేఖర్ అనే వ్యక్తి ద్వారా గూరువారెడ్డి అనే వ్యక్తి జయప్రకాశ్‌కు పరిచయమయ్యాడు. డబ్బు సంపాదించాలనే దురాశతో, గూరువారెడ్డి సూచన మేరకు జయప్రకాశ్‌గౌడ్ అల్ప్రాజోలం తయారీ విధానాన్ని, ఫార్ములాను నేర్చుకున్నాడు. అనంతరం, తన మూతపడిన స్కూల్ వెనుక భాగంలోనే ఈ అల్ప్రా జోలం తయారీ యూనిట్‌ను రహస్యంగా ఏర్పాటు చేశాడు.
అక్కడ అల్ప్రాజోలంను ఉత్పత్తి చేసి, ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని బూత్‌పూర్ పరిసర గ్రామాల్లోని టాడీ డిపోలకు అక్రమంగా సరఫరా చేస్తూ వస్తున్నాడు. ఈగల్ టీం దాడుల్లో జయప్రకాశ్‌గౌడ్‌తో పాటు మరో ముగ్గురిని అదుపు లోకి తీసుకుంది. వారి నుంచి 3.5 కిలోల అల్ప్రాజోలం పూర్తిగా తయారైనది, 4.3 కిలోల సెమీ-ఫినిష్డ్ అల్ప్రాజోలం సగం తయారైనది, రూ.21 లక్షల నగదు, పెద్ద ఎత్తున ముడి సరుకు, తయారీ యంత్రాలు, 8 రియాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు.
జయప్రకాశ్‌గౌడ్ ఈ దందా ద్వారా భారీ ఎత్తున అక్రమ సంపాదన కూడబెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా పాఠశాలను డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చడం, పిల్లల పుస్తకాల పక్కనే మత్తు పదార్థాల తయారీ జరగడం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మూతపడినప్పటికీ, విద్యాసంస్థ ప్రాంగణంలోనే ఇలాంటి దారుణమైన కార్యకలాపాలు సాగడం విద్యాసంస్థల భద్రత, పర్యవేక్షణపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.
తమ పిల్లలు చదువుకునే ప్రదేశాలు ఎంత సురక్షితం అనే భయం వారిలో నెలకొంది. ఈ కేసులో మరికొందరు వ్యక్తులు ప్రమేయం ఉన్నట్లు ఎక్సై జ్ అధికారులు అనుమానిస్తున్నారు. జయప్రకాశ్‌కు అల్ప్రాజోలం ఫార్ములా నేర్పిన గూరువారెడ్డి, అతన్ని పరిచయం చేసిన శేఖర్‌తో పాటు, ఈ దందా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, సరఫరా గొలుసులోని వారందరినీ గుర్తించి పట్టుకునే దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.