calender_icon.png 14 September, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డంగా వేసిన రాళ్లు తీసేశారు

16-12-2024 01:17:36 AM

కమిషనర్ ఆదేశాలతో తొలగించిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ వెంకటగిరి హైలం కాలనీలోని గౌతమి స్కూల్‌కు వెళ్లే దారిలో కొత్తగా రోడ్డు నిర్మాణం కోసం పాత రహదారిని తవ్వి, రోడ్డుపై వదిలేసిన రాళ్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎట్టకేలకు తొలగించారు.

ఆదివారం విజయక్రాంతి దినపత్రిక లో వచ్చిన ‘తవ్వారు.. వదిలేశారు..’ అనే  కథనానికి అధికారులు స్పందించారు. రోడ్డుకు అడ్డంగా వదిలేసిన రాళ్లను తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలతో సిబ్బంది వాటిని అక్కడి నుంచి పక్కకు తొలగించారు. నెల రోజులుగా రోడ్డుకు అడ్డంగా ఉన్న రాళ్లను తొలగించడం తో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.