14-09-2025 01:27:10 AM
చిన్నారుల భవిష్యత్ ముఖ్యం
భరతమాత కిరీటంలోని రత్నం మణిపూర్
* మేం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి మణిపూర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. చాలెంజింగ్‌గా తీసుకుని అభివృద్ధి చేస్తున్నాం. సరైన రోడ్లు లేక మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో నేను అర్థం చేసుకున్నా. అందుకే 2014 నుంచి మెరుగైన రవాణా వ్యవస్థ కోసం అధిక నిధులు కేటాయిస్తున్నాం. మొదట మణిపూర్‌లో రోడ్డు, రైల్వే వ్యవస్థల కోసం బడ్జెట్ పెంచాం. తర్వాత రాష్ట్రంలోని గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పిస్తున్నాం.
ప్రధాని నరేంద్ర మోదీ
ఇంఫాల్/ఐజ్వాల్, సెప్టెంబర్ 13: మణిపూర్ ప్రజలు హింసను విడనాడి శాంతిని పాటించాలని, అదే వారి పిల్లల భవిష్యత్‌ను భద్రపరుస్తుందని, శాంతితోనే భవిత అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాం తిని నెలకొల్పేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని అభ్యర్థించారు. ప్రజల ఆశయాలు, కలలు నెరవేర్చాలని స్వచ్ఛంద సంస్థలను కోరారు. నేను మీవెంటే ఉన్నాను అని మణిపూర్ వాసులకు ధైర్యం చెప్పారు.
శనివారం మణిపూర్‌లో పర్యటించిన ప్రధా ని చురాచంద్‌పూర్‌లో జరిగిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వా తావరణం సహకరించకపోవడంతో రోడ్డుమార్గానే చురాచంద్‌పూర్‌కు వెళ్లారు. ‘మణి పూర్ ధైర్యవంతుల గడ్డ. మణిపూర్‌లో త్వర లో కొత్త శకం ఆరంభం అవ్వబోతోందని నేను విశ్వాసంతో చెబుతున్నా. అభివృద్ధి చెం దేందుకు శాంతి చాలా ముఖ్యం. మణిపూర్ పేరులోనే రత్నం ఉంది.
రానున్న రోజుల్లో మొత్తం ఈశాన్య భారతానికి ఆ రత్నం వెలుగులు పంచనుంది. ఈ రోజు శంకుస్థాపన చేసిన పలు ప్రాజెక్టులతో ప్రజల జీవనస్థితులు మారనున్నాయి. మణిపూర్ కొండల్లో నివసించే షెడ్యూల్ తెగలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. విద్య, ఆరోగ్యంలో ఈ ప్రాజెక్టులు ఎన్నో సౌకర్యాలను కల్పించనున్నాయి. అభివృద్ధికి శాంతి అత్యంత ముఖ్య మైనది. మణిపూర్‌లో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం బడ్జెట్‌లో అధిక భాగం నిధులు కేటాయిస్తోంది.
మేం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి మణిపూర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. చాలెంజింగ్‌గా తీసుకుని మణిపూర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. సరైన రోడ్లు లేక మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో నేను అర్థం చేసుకున్నా. అందుకో సమే 2014 నుంచి మణిపూర్‌లో మెరుగైన రవాణా వ్యవస్థ కోసం అధిక నిధులు కేటాయిస్తున్నాం. మొదట మణిపూర్‌లో రోడ్డు, రైల్వే వ్యవస్థల కోసం బడ్జెట్ పెంచాం.
తర్వా త మణిపూర్ గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పిస్తున్నాం. గడిచిన కొద్ది సంవత్సరాల్లోనే మణిపూర్‌లో జాతీయ రహదారుల కోసం రూ.3,700 కోట్లు ఖర్చు చేశాం. రూ. 8,700 కోట్లు నూతన హైవేల ఏర్పాటుకు కేటాయించాం. మా ప్రభుత్వ హయాంలో మణిపూర్‌లో రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. రాజధాని ఇంఫాల్‌లో నూతనంగా నిర్మించిన విమానాశ్రయం కోసం రూ. 400 కోట్లు వెచ్చించాం. ఇంఫాల్‌ను జాతీ య రైల్ నెట్వర్క్‌తో అనుసంధానించేందుకు రూ. 22,000 కోట్లు కేటాయించాం.
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం నిర్విరామంగా కృషి చేస్తోంది. ఒకప్పుడు దేశరాజధాని ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకునేం దుకు ఎన్నో రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. భార త ప్రభుత్వమే మణిపూర్ ప్రజల వెంట ఉం ది. స్వచ్ఛంద సంస్థలు శాంతి కోసం కృషి చేయాలని అభ్యర్థిస్తున్నా. రాష్ట్రంలో ఏడు వేల నూతన గృహాల నిర్మాణానికి ప్రభుత్వం సాయం చేసింది.
మణిపూర్ శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా మారాలి’ అని ప్రజలను ద్దేశించి ప్రసంగించారు. మణిపూర్ అల్లర్ల వల్ల సర్వస్వం కోల్పోయిన వారితో రాజధాని ఇంఫాల్‌లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు. మరో ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో కూడా మోదీ పర్యటించారు. అక్కడ నూతనంగా నిర్మించిన బైరాబి-సైరంగ్ రైల్వే లైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు.
‘ఈ రైల్వే లైన్ వల్ల ఈశాన్య రాష్ట్రాలకు దేశ రాజధానితో మరిం త అసుసంధానం ఏర్పడనుంది. ఈ రోజు ఐజ్వాల్ భారత రైల్వేమ్యాప్‌లో చేరిపోయిం ది. ఇది కేవలం రైల్వే మాత్రమే కాదు.. మిజో రాం ప్రజల పరివర్తనకు జీవనాడి’ అని పేర్కొన్నారు. ఈ రైల్వే లైన్‌తో పాటు రూ. తొమ్మిది వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సం దర్భంగా ఐజ్వాల్ నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ప్రారంభించారు. వాతావరణం సహకరించకపోవడంతో ఐజ్వాల్‌లోని లమ్మువల్ మై దానానికి ఆయన చేరుకోలేకపోయారు. దీం తో ఆయన లెంగుపుయ్ విమానాశ్రయం నుంచే వర్చువల్‌గా ప్రసంగించారు.
వారికి ఎప్పుడూ ఓట్ల ధ్యాసే..
‘దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలకు ఎప్పుడూ ఓట్ల మీద ధ్యాసే. ఎక్కువ ఓట్లు, సీట్లు వచ్చే ప్రాంతాలపైనే వారు దృష్టి కేంద్రీకరిస్తారు. వారి ప్రవర్తన వల్ల ఈశాన్య రాష్ట్రా లు ఇబ్బందులు పడ్డాయి. మా విధానం వే రు. గత పాలకుల ప్రవర్తన వల్ల ఎవరైతే వె నుకబాటుకు గురయ్యారో వారినే ముం దుంచాం. అణచివేతకు గురైన వారు అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పాల నలో మందులు, బీమా పాలసీలు అధిక పన్నులు విధించారు. ప్రస్తుతం అవి అందుబాటులోకి వచ్చాయి’ అని వివరించారు.
భారీ వర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని
మిజోరాం నుంచి మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి 65 కిలోమీటర్ల దూరంలోని చురాచంద్‌పూర్‌కు వెళ్లాలి. చురాచంద్‌పూర్‌కు వాయు మార్గాన వెళ్లేందుకు వాతావరణం సహకరించకలేదు. భారీ వర్షం కురవడంతో ప్రధాని రోడ్డు మార్గానే చురాచంద్‌పూర్‌కు వెళ్లారు. చురాచంద్‌పూర్‌లోని కుకీ తెగ వారిని కలిసి వారి ఇబ్బందులు తెలుసుకునేందుకు ప్రధాని అక్కడికి వెళ్లారు.
చురాచంద్‌పూర్‌కు చేరుకున్న అనంతరం రూ. 7,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జాతుల మధ్య ఘర్షణల కారణంగా ఆవాసాలు కోల్పోయిన వారితో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధాని మోదీ ఇంఫాల్‌లో ఉండగా.. ఓ చిన్నారి తన బాధలను ప్రధానితో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయింది.
అస్సాంకు చేరుకున్న ప్రధాని
గువహటి, సెప్టెంబర్ 13: మణిపూర్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ శనివారం అస్సాంకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారతరత్న, అస్సాం మాజీ ఎమ్మెల్యే భూపేన్ హజారికా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. భూపేన్ హజారికా గుర్తుగా ప్రత్యేక వంద నాణేన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో కలిసి ప్రధాని విడుదల చేశారు. హజారికా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన పాటలు మానవత్వ స్ఫూర్తిని తెలియజేస్తాయని ప్రధాని పేర్కొన్నారు.
చేరుకోలేనందుకు క్షమించండి
ప్రధాని మోదీ వాతావరణం సహకరించకపోవడంతో ఐజ్వాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకాలేకపోయారు. దీంతో వేచి చూస్తున్న ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పారు. ‘నేను మిజోరాం లోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలోనే ఉన్నా. వాతావరణం సహక రించకపోవడం వల్ల సభా ప్రాంగణానికి రాలేకపోతున్నా. ఐజ్వాల్‌లో మీతో కలిసి పాల్గొననందుకు నన్ను క్షమించండి. నేను వర్చువల్ పద్ధతిలో ప్రసంగించినా మీ ప్రేమ, అను రాగం, ఆప్యాయతలను అనుభవించగలను’ అని మోదీ పేర్కొన్నారు.