calender_icon.png 18 May, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శరవేగంగా హయత్ నగర్ డివిజన్ అభివృద్ధి

16-05-2025 11:15:50 PM

కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

ఎల్బీనగర్: హయత్ నగర్ డివిజన్ లోని దత్తాత్రేయ కాలనీ లో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కాలనీవాసులు కాలనీలో మిగిలి ఉన్న విధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రణాళికతో దశలవారీగా కాలనీలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  రానున్న రోజుల్లో హయత్ నగర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి మరింత వేగవంతం చేసే విధంగా  చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో ఏఈ హేము నాయక్, దత్తాత్రేయ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.