calender_icon.png 27 December, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు రోజులు వర్షాలు

31-07-2024 12:31:47 AM

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధ, గురు, శుక్రవారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ మంగళవారం ప్రకటించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 344.6 మి.మీ వర్షపాతం కురిసిందని తెలిపింది. వికా రాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జొగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, కుమ్రం భీం జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురిసిం ది. అలాగే కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.