27-12-2025 03:22:16 AM
ఘట్ కేసర్, డిసెంబర్ 26 (విజయక్రాంతి) : మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఓమిని మారుతి వ్యాన్ కారులో అగ్నిప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి అన్నోజిగూడ వద్ద సర్వీస్ రోడ్డుపై వెళ్తుండగా మారుతి వ్యాన్ లో సిలిండర్ పేలి మంటలు అంటుకున్నాయి.మంటలతో భారత్ పెట్రోల్ బంక్ లోకి కారు దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన బంక్ సిబ్బంది నీళ్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో కారు పూర్తిగా తగలబడిపోయింది. కాగా ఈప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన పై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.