10-10-2025 12:09:44 AM
పిలుపునిచ్చిన టీఎన్జీవో నేతలు
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ ఎన్జీవో రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం కన్వీనర్ ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్, కో కన్వీనర్ కస్తూరి వెంకట్ నాయకత్వంలో నిర్వహించారు. సమావేశంలో కేంద్ర సంఘ కోశాధికారి సత్యనారాయణగౌడ్, ఉపాధ్యక్షులు పర్వతాలు, ఈశ్వర్, పూర్వ అధ్యక్షుడు ఆర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ముజీడ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన కోసం టీఎన్జీవో సంఘం అనునిత్యం పోరాడుతుందని, అందుకు ప్రతి ప్రాథమిక సభ్యుడు సంఘ పిలుపుమేరకు పాల్గొనాలని, ప్రధానంగా రంగారెడ్డి జిల్లా ఉద్యోగుల సమస్యలైన జిల్లా కలెక్టరేట్ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ 24%, పెండింగ్ డీఏల సాధన, పెండింగ్ బిల్లుల మంజూరు, హెల్త్‌కార్డుల మంజూరు, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయడం, నూతన వేతన సవరణ పెండింగ్ సమస్యల సాధన కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే, పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
త్వరలో టీఎన్జీవో రంగారెడ్డి జిల్లాకు రెగ్యులర్ ఎన్నికలు జరపడం కోసం విరివిగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. తాలూకా స్తాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికలు నిర్వహించుకుందామని కో కన్వీనర్ కస్తూరి వెంకట్ తెలియజేశారు.