calender_icon.png 28 November, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్

28-11-2025 12:00:00 AM

రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

డ్రైవర్‌ను కూడా అదుపులో తీసుకున్న అధికారులు

అర్మూర్, నవంబర్ 27 (విజయ క్రాంతి) : ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఇంటి నెంబర్ కేటాయించేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం ఏసీబీకి పట్టుబడ్డాడు. అతనితోపాటు అతని డ్రైవర్ భూమేష్ సైతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.వివరాలకు వెళ్తే.. మున్సిపల్ కమిషనర్ రాజు గత నాలుగేళ్ల క్రితం ఆర్మూర్‌కు బదిలీపై వచ్చాడు.

వచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో డబ్బులు వసూలు చేసేవాడు.నేరుగా తీసుకోకుండా కిందిస్థాయి అధికారుల నుంచి డబ్బులు దండుకునేవాడు. పాలకవర్గం పదవీ కాలం ముగిసిన తర్వాత రాజు వసూళ్ల పర్వం మరింత పెరిగిపోయింది. ఇతరులను నమ్మక అతని సహోదరుల ద్వారా తీసుకునేవాడు. కాగా కమిషనర్ నివసించే ఇం టికి సమీపంలోనే ఉండే వ్యక్తి ఇంటికి నెంబర్ కేటాయించే విషయంలో డబ్బులు తీసు కొని పట్టుబడ్డాడు. 50 వేలు డిమాండ్ చేసి 20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో 20వేలను అతని డ్రైవర్ భూమేష్ కు ఇవ్వగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.అతని దగ్గర ఉన్న బ్యాగును చెక్ చేయగా అం దులో ఉన్న రూ.4.30 లక్షల నగదు సైతం స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ రాజును, డ్రైవర్ భూమేష్ ను నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. లంచాలు కోసం అధికారులు ఇబ్బంది పెడితే తమను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.