calender_icon.png 28 November, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల పేరుతో బెదిరింపులు.. నిందితుల అరెస్ట్, రిమాండ్

28-11-2025 12:00:00 AM

ఎస్పీ యం. రాజేష్ చంద్ర వెల్లడి

కామారెడ్డి, నవంబర్ 27 (విజయక్రాంతి): పోలీసుల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులని చెప్పి బెదిరించి, బలవంతంగా ఫిర్యాదిదారుల వద్ద నుండి రూ.1,800, ఒక మొబైల్ ఫోను దోచుకున్న ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. తేదీ 26.11.2025న  వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో సరంపల్లి ఎక్స్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తెల్ల రంగు హ్యుందాయ్ క్రెటా కారు (TS15EM5000) ను పోలీసులు ఆపగా, డ్రైవర్ అయిన జింక భాస్కర్ పారిపోవడానికి యత్నించినప్పటికీ జింక భాస్కర్ ను, లక్ష్మణ్ లను పట్టుకోవడం జరిగింద.

విచారణలో తేలింది, నిందితుడు జింక భాస్కర్ తన స్నేహితులు నవీన్ గౌడ్ మరియు లక్ష్మణ్ తో కలిసి, చిన్న మల్లారెడ్డి శివారు, ఎల్లమ్మ దేవాలయం వద్ద ఒక వ్యక్తి నుండి రూ.1,800 మరియు ఒక మొబైల్ ఫోన్లను  పోలీసులని చెప్పి బెదిరించి, బలవంతంగా  గుంజుకోవడం జరిగింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండు కు తరలించడం జరిగింది. మొబైల్ ఫోను,  కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల భద్రతకు అప్రమత్తంగా ఉందన్నారు.