28-11-2025 12:00:00 AM
-సంగారెడ్డి జిల్లాలో 149 నామినేషన్లు
-మెదక్ జిల్లాలో 59 నామినేషన్లు
సంగారెడ్డి, నవంబర్ 27(విజయక్రాంతి):సంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో గురువారం నుండి నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. అందులో భాగంగా జిల్లాలోని మొదటి విడతలో ఏడు గ్రామ పంచాయతీలకు గాను 149 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబ తెలిపారు. సంగారెడ్డి మండలంలోని 104 వార్డులకు 18, కంది మండలంలోని 212 వార్డులకు గాను 38, కొండాపూర్ మండలంలో 222 వార్డులకు గాను 39, సదాశివపేట మండలంలోని 272 వార్డులకు గాను 5, పటాన్చెరు మండలం 36 వార్డులకు గాను 17, గుమ్మడిదల మండలంలోని 66 వార్డులకు గాను 3, హత్నూర మండలంలోని 334 వార్డులకు గాను 29 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. మొత్తంగా తొలిరోజు 1246 వార్డులకు గాను 149 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.
మెదక్ జిల్లాలో 59 నామినేషన్లు దాఖలు...
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నుండి సర్పంచ్ అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరించారు. అందులో భాగంగా మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో ఆరు మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. అల్లాదుర్గం మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్ కోసం 6, రేగోడు మండలంలో 18 పంచాయతీలకు గాను 7 నామినేషన్లు, పెద్దశంకరంపేట మండలంలో 27 గ్రామ పంచాయతీలకు గాను 8 సర్పంచ్ స్థానాలకు, టేక్మాల్ మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు గాను 5 సర్పంచ్ స్థానానికి గాను, ఒకటి వార్డు స్థానానికి నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే పాపన్నపేట మండలంలోని 40 పంచాయతీలకు గాను 13 సర్పంచ్ స్థానాలకు, హవేళీఘణపూర్ మండలంలోని 30 గ్రామ పంచాయతీలకు గాను 16 సర్పంచ్ స్థానానికి, 3 వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తంగా 160 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్ స్థానానికి 55 నామినేషన్లు, 4 వార్డు స్థానాలకు దాఖలైనట్లు తెలిపారు.