15-10-2025 05:09:08 PM
కోదాడ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ముస్లిం మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ బాజాన్, మైనార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు అల్లీ ఆధ్వర్యంలో బుధవారం కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయం ఆవరణలో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవేటి రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, కిసాన్ సెల్ అధ్యక్షుడు అశోక్, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు యస్ దాని, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మునీర్, బాగ్దాద్, కలీల్, దస్తగిరి, దాదావలి, జహీర్, బాబా, షాబుద్దీన్, మదార్, నజీర్, షఫీ, అహ్మద్, సయ్యద్ హుస్సేన్, యాకూబ్ పాషా, నాగుల్ మీరా, లాల్ పాషా పాల్గొన్నారు.