calender_icon.png 15 October, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఆర్‌పై అవగాహన సదస్సు

15-10-2025 05:01:21 PM

మెట్ పల్లి (విజయక్రాంతి): సీపీఆర్‌ వారోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని సమావేశ మందిరంలో సీపీఆర్‌ పై మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి, డాక్టర్ తాటిపర్తి శివానిలు వివరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు గుండె జబ్బుల ద్వారానే అవుతున్నాయని, ప్రతి ఒక్కరూ సీపీఆర్‌ కార్డియో పల్మనరీ రీసెర్సిటేషన్ పై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.

అత్యవసర సమయంలో మన తోటి వారికి కార్డియా కరెస్టు నుండి సీపీఆర్‌ చేసి, అంబులెన్స్ ద్వారా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి  ప్రాణాలు నిలబెట్టొచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పోషకాహారం తీసుకుంటూ ఉప్పును తగ్గించాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని సూచించారు. జీవనశైలి మార్పుల ద్వారానే వ్యాధులను అరికట్టవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి ఎంపీడీవో, గ్రామపంచాయతీ సెక్రటరీలు, హెల్త్ సూపర్వైజర్ అచ్యుతరావు, జగన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.