23 June, 2026 | 2:32 AM

నేడు రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

23-06-2026 12:11 AM

పెబ్బేరు జూన్ 12:  పెబ్బేరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దేవర్ల కార్తీక్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారని విమర్శించారు.

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం ఉచిత ప్రవేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు, మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు.

గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించి నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫాంల పంపిణీతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. జూన్ 23 బంద్ను విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు విజయవంతం చేయాలని దేవర్ల కార్తీక్ పిలుపునిచ్చారు.