28 August, 2026 | 2:04 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

మత్తుకు బానిసైతే జీవితం చిత్తవుతుంది

23-06-2026 12:12 AM

మధురానగర్ సీఐ ప్రభాకర్

జూబ్లీహిల్స్, జూన్ 22 (విజయక్రాంతి): మత్తుకు బానిసైతే జీవితం చిత్తవుతుందని మధురానగర్ పోలీస్ స్టేషన్ సీఐ హెచ్.ప్రభాకర్ హెచ్చరించారు. స్టేషన్ ఆధ్వర్యంలో డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మధురానగర్ మెరిటో జూనియర్ కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సీఐ మాట్లాడారు. మత్తుకు బానిసవ్వడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు.

అంతేకాకుండా కుటుంబ సభ్యులకు బాధ కలుగుతుందన్నారు.సమాజంలో పరువుపోయి తీవ్ర వేదనకు గురి కావాల్సి వస్తుందన్నారు. మత్తుకు బానిసైనవారు తమ జీవితంతో పాటు తమతో ఉండేవారి జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తారని వివరించారు. అంతేకాకుండా అసాంఘీక శక్తుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో భాగమయ్యే ముప్పు పొంచి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. సురక్షితమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.