24-10-2025 06:34:40 PM
సభ్యత్వం తీసుకున్న విద్యార్థులు
పాపన్నపేట,(విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అనేక రకాల ఉద్యమాలకు నాంది పలికిందని ఏబీవీపీ మెదక్ విభాగ్ సంఘటన మంత్రి బోడ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆయన సమక్షంలో శుక్రవారం పాపన్నపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులుగా పి.సంతోష్, కార్యదర్శిగా వినయ్, ఉపాధ్యక్షులుగా విక్రం, యాది లక్ష్మి, వంశీ, సహాయ కార్యదర్శులుగా బాలరాజ్, శ్రీకాంత్, అశ్విని తదితరులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయవాదం దేశభక్తి వైపు లక్షలాదిమంది విద్యార్థులను జాతీయవాదులుగా తయారు చేస్తున్న సంస్థ ఏబీవీపీ అని అన్నారు. చదువుతోపాటు నైతిక విలువలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకున్న విద్యార్థుల కోసం పక్క భవనాలు మంజూరు చేయాలని, స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.