24-10-2025 06:38:23 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ముగింపు ఉత్సవాలకు ఆటోడ్రైవర్లు విరివిగా విరాళాలు అందించాలని కంచర్ల జమలయ్య కోరారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో శేషగిరి భవన్ లో ఆటో డ్రైవర్ల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ రాజీలేని పోరాటాలు చేస్తున్నందున ఆనాడు పార్టీపై నిషేధo విదిoచారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుల పై కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు.
అయినప్పటికీ కార్మిక విద్యార్థి యువజన రైతు మహిళ తదితర ప్రజాసంఘాలు నిర్మించి వేట్టి చాకీరీ విముక్తి కలిగించి,భారత దేశ రాజకీయ చరిత్రలో సిపిఐ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదన్నారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు పుట్టినిల్లు, రామనాథం, దేవనూరు, శేషగిరిరావు, నల్లమల్ల గిరిప్రసాద్, మహమ్మద్ రజబలి తదితర పోరాటయోధులు మన ఖమ్మం వాసులు కావటం గర్వకారణం. తొలి నుంచి కమ్యూనిస్టులను కన్నతల్లిలా ఆదరించి, అనేక విజయాలను అందించిందన్నారు.