calender_icon.png 5 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌ను విశ్వగురు స్థానంలో నిలపడమే ఏబీవీపీ లక్ష్యం

05-12-2025 02:10:04 AM

కొత్తపల్లి, డిసెంబర్ 04(విజయక్రాంతి):అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక విహెపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ మాట్లాడుతూ నవంబర్ 28, 29 మరియు 30వ తేదీలలో డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ లో ఏబీవీపీ 71వ జాతీయ మహాసభలు దాదాపు 2000 వేల మంది ప్రతినిధులతో ఘనంగా నిర్వహించడం జరిగిందని,

ఈ సమా వేశాల్లో భారతదేశ నలుమూలల కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పాల్గొని విద్యారంగ సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక సమస్యల పట్ల నిరంతరం ఏబీవీపీ చేస్తున్న ఉద్యమాలను సాధించిన విజయాలను నూతనంగా రావలసిన మార్పులను గురించి చర్చించుకోవడం జరిగిందని తెలిపారు.

అనంతరం ఏబీవీపీ పలు తీర్మానాలు చేసి విద్యారంగం ప్రస్తుతం వికసిత భారత్, జెన్ -జి వంటి విశాల పట్ల అవగాహన చేయడం సమాజాన్ని జాగృత పరచడం కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ గత సంవత్సరం 55 లక్షల సభ్యత్వం తో ముందుండి విద్యార్థులను సమాజాన్ని జాతీయవాద సిద్ధాం తం వైపు నడిపిస్తూ వచ్చింది ప్రస్తుతం 76,98,448 లక్షలు సభ్యత్వంతో చరిత్రను తిరగరాసి ప్రపంచంలోనే మళ్లీ ఒకసారి అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది అని తెలిపారు.

ఈ జాతీయ మహాసభలలో రాబోయే 72వ జాతీయ మహాసభలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోతున్నామని అధికారికంగా ప్రకటించగా, తెలంగాణ నుండి వెళ్లిన ప్రతినిధులు అంతహర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ జాతీయ మహాసభలతో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు ఎబివిపి కార్యచరణ రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి చిప్ప యోగేష్, వంశీ,శివ ,ఆకాష్ మరియు ప్రశాంత్‌పాల్గొన్నారు.