05-12-2025 12:48:09 AM
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పారి శ్రామిక వాడలో గురువారం నిర్వహించిన కేటీఆర్ పర్యటన కవరేజీకి వెళ్లిన వీడియో జర్నలిస్టు గుండెపోటుతో కుప్పకూలిపో యాడు. ఆయనను ఆస్పత్రికి తరలించి, వైద్యం అందించినా ప్రాణాలు దక్కలేదు. విధినిర్వహణలో వీడియో జర్నలిస్టు దామోదర్ హఠాన్మరణం చెందడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
దామోదర్ మరణవార్త తెలిసిన వెంటనే కేటీఆర్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దామోదర్ నాకు తెల్సిన మీడియా మిత్రుడని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆసుపత్రిలో చివరి నిమిషం వరకు పర్యవేక్షణ
దామోదర్ అస్వస్థతకు గురైన విషయం తెలియగానే కేటీఆర్ వెంటనే స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ఆరా తీసి, తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని పార్టీ నేతలను కోరారు. కేటీఆర్ సూచనల మేరకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆసుపత్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.
దామోదర్‌కు సీపీఆర్ చేయడం, ఇతర అత్యవసర వైద్య చికిత్సలు అందించడం వంటి అంశాలను దగ్గరుండి ఆసుపత్రి యాజమాన్యంతో సమన్వయం చేశారు. ప్రాణాలు కాపాడేందుకు పార్టీ నేతలు శాయశక్తులా కృషి చేసినప్పటికీ, ఫలితం దక్కలేదని ఆవేదన చెందారు. దామోదర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన కేటీఆర్, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో దామోదర్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చురుకుగా ఉద్యమ వార్తల కవరేజ్ : మాజీ సీఎం కేసీఆర్
తెలంగాణ సీనియర్ వీడియో జర్నలిస్టు దామోదర్ మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఇండియా టుడే జాతీయ న్యూస్ ఛానల్‌లో పనిచేస్తున్న దామోదర్, తాను పార్టీ స్థాపించిన తొలినాటి నుంచీ, తెలంగాణ ఉద్యమ వార్తల కవరేజ్‌లో చురుకుగా పాల్గొనే వాడని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న దామోదర్ అకాల మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన కేసీఆర్, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
వీడియో జర్నలిస్ట్ దామోదర్ ఆకస్మిక మర ణం పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దామోదర్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యా న్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు.