calender_icon.png 5 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తిరుపతి సతీమణి సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు

05-12-2025 02:12:25 AM

సుల్తానాబాద్ డిసెంబర్ 4 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఉప్పు తిరుపతి సతీమణి లక్ష్మి మంచిరామి గ్రామ సర్పంచ్ గా గురువారం నామినేషన్ దాఖలు చేశారు... ఈ సందర్భంగా ఉప్పు తిరుపతి మాట్లాడుతూ ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలలో తిరిగిన అనుభవం నాకు ఉందని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాతావరణం గ్రామాల అభివృద్ధి చూసి మా సొంత గ్రామం కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సర్పంచ్ గా పోటీ కి ముందుకు రావడం జరిగింది అన్నారు....

తన సొంత గ్రామమైన మంచిరామి గ్రామానికి గుడి , బడి , విద్య తదితర సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.. ఊరిలో కోతుల బెడద లేకుండా నా సొంత ఖర్చులతో వాటిని నివారించాం జరిగిందని తిరుపతి అన్నారు ...యువతను ప్రోత్సహిస్తూ వారికి మంచి ఉద్యోగాలు అందేలా కృషి చేస్తాం అన్నారు..మా వారి ప్రోద్బలం తో ఐపిఎస్ అధికారి గా మా ఊరి నుండి యువత ఉద్యోగాలు సాధించేలా మా వంతు కృషి చేస్తాం అని ఉప్పు తిరుపతి భార్య సర్పంచ్ గా నామినేషన్ వేసిన లక్ష్మీతెలిపారు...