calender_icon.png 5 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ విజయోత్సవ సభలను నిలిపివేయండి

05-12-2025 02:11:11 AM

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

కరీంనగర్, డిసెంబరు 4 (విజయ క్రాంతి): ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవ సభలను వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కోరారు. గురువారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. హుస్నాబాద్ లో జరిగిన విజయోత్సవ సభకు గ్రామీణ ప్రాంతాల్లో నుండి ప్రజలను తరలించడం, స్కూల్ పిల్లల్ని తరలించడం సిగ్గుచేటని అన్నారు.

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విజయోత్సవసభల పేరిట ఎన్నికల సభ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ ఎస్ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ స్పందించి విజయోత్సవ సభల ను నిలిపి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ తిరుమల్ రావు, గట్టుబుత్కూరు మాజీ సర్పంచ్ విజేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, నాయకులు సత్తినేని శ్రీనివాస్, నవీన్ రావు, తదితరులు పాల్గొన్నారు.