calender_icon.png 13 September, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజు కొనసాగుతున్న నిఖేష్ కుమార్ విచారణ

13-12-2024 02:23:12 PM

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై అరెస్టయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) నిఖేష్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెండో రోజు కూడా విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో విచారణ జరుపుతున్నారు. నిఖేష్ ‌కుమార్‌కు చెందిన కోట్లాది రూపాయలకు సంబంధించిన సమాచారాన్ని ఏసీబీ దర్యాప్తు అధికారులు ముమ్మరంగా సేకరిస్తున్నారు. దర్యాప్తు పరిధిలో నిందితుల వద్ద ఉన్న బినామీ ఆస్తులపై కూడా విచారణ ఉంటుంది. విచారణలో భాగంగా నిఖేష్ కుమార్‌ సమక్షంలోనే అతడికి సంబంధించిన బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరవనున్నారు.