calender_icon.png 13 September, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్‌ తరలింపు

13-12-2024 02:40:11 PM

హైదరాబాద్: చిక్కడపల్లి పీఎస్ నుంచి అల్లు అర్జున్ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బ్లాక్‌ వద్ద అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు చేశారు. కుమారుడితో పాటు అల్లు అరవింద్‌ గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా అల్లు అర్జున్ ను పోలీసులు  సుమారు రెండు గంటల పాటు విచారించారు.

గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షల తర్వాత అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. అల్లు అర్జున్ అరెస్టు అంశంలో చట్టప్రకారం ఫాలో అవుతున్నామని పోలీసులు వెల్లడించారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ నేతృత్వంలో అల్లు అర్జున్ విచారణ జరిగింది. శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ను తన ఇంట్లోనే పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి ఢిల్లీలో పుష్ప-2 సక్సెస్ మీట్ ఆయన పాల్గొని ఉదయం హైదరాబాద్ వచ్చారు. అల్లు అర్జున్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. కాసేపట్లో అల్లు అర్జున్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంంది. అత్యవసర పిటిషన్ గా విచారించాలని అల్లు అర్జున్ న్యాయవాది హైకోర్టును కోరారు.