20-11-2025 12:46:51 AM
టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో విస్తృత తనిఖీలు
నిజామాబాద్ నవంబర్ 19 (విజయ క్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల్లో కలకలం సృష్టించింది. కొన్ని సంవత్సరాలుగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో తీవ్రస్థాయిలో అవినీతి జరుగుతోందని వస్తున్న ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించడం ఉద్యోగుల్లో గూ భూలు పుట్టించింది. నిజామాబాద్ కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి.
అధికారుల సోదాలు పూర్తి అయిన తర్వాత వివరాలు వెల్లడించనున్నారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్‌కీలక విభాగం. నిజామాబాద్ టౌన్‌ప్లానింగ్ అధికారులపై కొంతకాలంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి.
కొంతమంది నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించు కోకుండా అధికారులు మాముళ్లు తీసుకొని చూసి చూడనట్లు గా వ్యవహరిస్తూ అక్రమార్కులకు అక్రమ నిర్మాణదారులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వెళ్లి వచ్చాయి. నగరం శివారు తో పాటు నగరంలో జరుగుతున్న భవన నిర్మాణల సమయంలో ప్రవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని భవన నిర్మాణదారుల నుండి ముక్కు పిండ భారీ ఎత్తున డబ్బుల పశువులకు పాల్పడుతు న్నారన్నఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఏసీబీ అధికారులు సోదాలు చేయడం గమనార్హం. అయితే దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు ఇటీవల నిజామాబాద్ జిల్లా లో ని ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా సోదాలు నిర్వహిస్తుండడంతో అవినీతి అధికారుల్లో కలవరం మొదలైంది. ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆర్టీ ఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ నెల 14న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తనిఖీలు చేపట్టింది.
18న విద్యా శాఖ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తాజగా కార్పొరేషన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతి అధికారులు వెన్నుల్లో వణుకు మొదలైంది. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో శ్రవణ్, అనుపమ అనే ఇద్దరు ఉద్యోగులు పట్టుబడినట్లు తెలుస్తోంది అధికారికంగా ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది