20-11-2025 12:48:40 AM
-ఎస్ఆర్కె డిగ్రీ , పీజీ కళాశాలలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి ఉత్సవాలు
-మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల
కామారెడ్డి, నవంబర్ 19 (విజయ క్రాంతి): సమాజంలో మహిళలకు మంచి గౌరవం ఉంటుందని చరిత్ర తెలుసుకొని ముందుకు వెళ్లాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రమీల అన్నారు. బుధవారం ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి ఉత్సవాలను ఎస్‌ఆర్కె డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సంద ర్భంగా జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారులు ప్రమీల మాట్లాడుతూ విద్యార్థులకు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలియజేస్తూ అతి చిన్న వయసులో వీరవనితగా పేరుపొందినటువంటి వ్యక్తి ఝాన్సీ లక్ష్మీబాయి అని తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లలిత, మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యార్థినిలు అందరూ పూర్వకాలంలో ఉన్న వ్యక్తుల జీవితం విశేషాలు అని తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలని కొనియాడారు. అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లా డుతూ దేశంలో తొలి స్వాతంత్ర సాయిరామానికి పునాది ఝాన్సీ లక్ష్మీబాయి అని అన్నారు 30 సంవత్సరాల లోనే భారతదేశంలో ప్రభుత్వ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేశా విధంగా ముందున్నారని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు శంకర్ కార్యదర్శి సబ్బని కృష్ణ రోటరీ సుధాకర్ నాగభూషణం నవీన్ ప్రిన్సిపాల్ దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.