20-10-2025 12:44:17 AM
పలుచోట్ల పట్టుబడ్డ నగదు
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 19,(విజయ క్రాంతి):రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దు చెక్పోస్టులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నీ రవాణా చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వ హించారు. రవాణా చెక్ పోస్టుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చెక్ పోస్టులపైఎసిబి అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట చెక్ పోస్ట్ లో ఏ సి బి డి ఎస్ పి వై రమేష్ పాల్వంచ పాల్వంచ చెక్పోస్ట్ లో ఖమ్మం డిఎస్పి సాంబయ్య, ముత్తగూడెం చెక్ పోస్టులో ఇద్దరు ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పాల్వంచ చెక్ పోస్ట్ వద్ద 26000, అశ్వరావుపేట చెక్ పోస్ట్ లో రూ 23 వేలు, ముత్తగూడెం చెక్ పోస్ట్ లో రూ 7000 అన్నదికారికంగా ఉన్న నగదును సీజ్ చేశారు.
చెక్ పోస్టుల నిర్వహణలోనూ వ్యత్యాసాలను గుర్తించి ప్రభుత్వా నికి నివేదికను సమర్పించనున్నట్లు ఎసిపి అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం చెక్ పోస్ట్ లు ఎత్తివేసినప్పటికి అనధికారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెక్ పోస్టులు నిర్వహిస్తూ రవాణాశాఖ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.