09-08-2025 07:51:43 PM
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా(Siddipet District) హుస్నాబాద్ లోని ఎల్లమ్మ ఆలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి నాడు నిర్వహించే విధంగానే, ఈ రాఖీ పౌర్ణమి రోజు కూడా చండీ హోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాగణపతి, నవగ్రహ పూజలు, పంచామృత అభిషేకం, కుంకుమ పూజ వంటి ప్రత్యేక కార్యక్రమాలను అర్చకుడు తాటికొండ పరమేశ్వర్ ఆధ్వర్యంలో జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.