09-08-2025 07:53:44 PM
చిగురుమామిడి (విజయక్రాంతి): చిగురుమామిడి మండలంలోని రేకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధి కోసం సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి(Former MLA Chada Venkat Reddy) రూ.50 వేల 116 చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు. ఆలయ అభివృద్ధి కోసం ఇటీవల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి నిధులు కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు. తన స్వగ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం త్వరితగతంగా అభివృద్ధి పూర్తి కావాలని కోరుకుంటున్నానన్నారు. ఇందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తులు ముందుకు రావాలని చాడ కోరారు. చాడ వెంట ఆలయ కమిటీ కార్యదర్శి కాసాని సతీష్, కోశాధికారి అరిగెల రమేష్ (ఆరోగ్యశ్రీ), సభ్యులు పరకాల కొండయ్య, చాడ అనిల్ రెడ్డి, కొలిపాక వేణు, తంగళ్ళపల్లి అంజయ్య, గాదపాక రవీందర్, అన్న సదానందం తదితరులు ఉన్నారు.