calender_icon.png 7 October, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టకు మరమ్మతు చేయించరూ!

07-10-2025 12:00:00 AM

-తాత్కాలిక మరమ్మతులతో ప్రయోజనం శూన్యం

-శాశ్వత మరమ్మతులు చేయించాలని డిమాండ్

ఎల్లారెడ్డి అక్టోబర్ 6 (విజయ క్రాంతి)  ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న పెద్ద చెరువు మొన్న కురిసిన భారీ వర్షాలకు కట్ట తెగి నీరంతా దిగువకు వెళ్ళిపోయి చాలామంది రైతుల పంటలు ఇసుక మేటల పెట్టి, తీవ్ర నష్టం జరిగింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని అధికారులు ఆదేశించడంతో, 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు గండి కూల్చడానికి, శ్యాన్డ్ గన్ని బ్యాగుల్లో మట్టినిప్పి కట్టకు అడ్డంగా వేసి మట్టిని పోస్తే భారీ వరదకు కురుస్తున్న వర్షాలకు తాత్కాలికంగా పోసిన కట్ట కొట్టుకుపోయి మళ్లీ గండి పడింది అని గ్రామస్తులు పేర్కొన్నారు.

తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చేసి రైతులను కాపాడాలని ఆ గ్రామస్తులు అధికారులను నాయకులను వేడుకుంటున్నారు. వందల ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు,20,వేల క్యూసెక్కుల వరకు నీరు నిలువ ఉంటుందని ఆ చెరువు మండలంలోని రెండవ చెరువని , చెరువుకు తిమ్మాపూర్ ప్రాంతంలో ఉన్న  దట్టమైన అడవి నుండి భారీ వరద ఆ చెరువులోకి చేరి చెరువు నిండుతుందని భారీ వరదకు కట్ట ఆగాలంటే శాశ్వత పరిష్కారం తప్పనిసరిగా చేయాలని ఆ గ్రామస్తులు పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారులు శాశ్వత పరిష్కార నిమిత్తం పనులు చేపట్టాలని కోరుకుంటున్నారు.

నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజనీర్, వెంకటేశ్వర్లు, వివరణ కోరగా, చెరువుకు తాత్కాలికంగా మరమ్మత్తులు చేపట్టామని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. గుత్తేదారుకు పనులు పూర్తయ్యే వరకు ఎటువంటి బిల్లులు చెల్లించేది లేదని తాత్కాలిక మరమత్తులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయవలసి ఉంటుందని అనవసరంగా రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని కొందరు తెలిసి తెలియక, సోషల్ మీడియాలో ప్రచురితం చేస్తున్నారని, తాత్కాలిక మరమత్తు పనులు ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారం పనులు జరుగుతున్నాయని తెలిపారు. గుత్తేదారి యంత్రాలు జెసిపి ట్రాక్టర్లు వంటి యంత్రాలు అక్కడే ఉన్నాయని వరద ఎగవన ఉన్న గట్టు నుండి ఉదృతంగా రావడంతో సాండ్ బ్యాగులతో అడ్డుగా వేసిన కట్ట కొట్టుకపోవడం జరిగిందని నెల రోజుల క్రితం కురిసిన వర్షంలో వచ్చినంత వరద చెరువులోకి చేరడంతో కట్ట ఆగలేక కొట్టుకపోయిందని తెలిపారు. శాశ్వతంగా చెరువు కట్టకు మరమ్మత్తులు చేయించే దిశగా,శాశ్వత పనులు,జరిగేవిధంగా, పై అధికారుల ఆదేశానుసారం చేపడతామని నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు తెలిపారు.