11-07-2025 12:25:52 AM
ఎంఎస్‌ఇ డీజీఎం ఎస్ ఆర్కే మూర్తి
కరీంనగర్ క్రైం, జూలై 10 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనిఎంఎస్‌ఇ డీజీఎం ఎస్ ఆర్కే మూర్తి పిలుపునిచ్చారు. గురువారం ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ ఆదేశాల మేరకు క్రెడిట్ గ్యారంచీ ట్రస్టు మీడియం అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజేస్ అవగాహన సదస్సు కరీంనగర్ లో కిసాన్ నగర్ లోని కెఎం కన్వేన్షన్ లో నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు మైక్రో అండ్ స్మాల్ ఎంట్ర్పజెస్ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఈ పథకం కింద రూపాయలు లక్ష నుండి మొదలు 10 కోట్ల వరకు ఎ లాంటి గ్యారెంటీ లేకుండా రుణాలు అందించేలా ప్రధాని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుందని వివరించారు.
ఆసక్తిగల వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ అంజనేయులు, అన్ని బ్యాం కుల ఏడీలు, కరీంనగర్ జిల్లా పరిశ్రమల అధికారి జయంతి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎం టర్ ప్రైజేస్ మేనేజర్ దేవేందర్, అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఎన్ జీ ఓ మినిస్ట్రీ ఆఫ్ స్మాల్‌మస్తాన్ ఖాన్, మాజీ కార్పోరేటర్ కుర్ర తిరుపతి, కంసాల శ్రీనివాస్, తదితరులుపాల్గొన్నారు.