31-10-2025 12:00:00 AM
 
							వారం రోజుల్లో 10 కేసులు ఛేదన.. 20 మంది అరెస్ట్
అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహానగరాన్ని కేంద్రంగా చేసుకుని అమాయక ప్రజలే లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ర్ట ముఠాల గుట్టును సైబరా బాద్ పోలీసులు రట్టు చేశారు. ట్రేడింగ్, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వంటి రకరకాల ఎరల తో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ముఠాలపై ఉక్కుపాదం మోపారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 10 కీలక కేసులు ఛేదించి, 20 మంది నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
సైబరాబాద్ పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల 22 నుం చి 28 వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో ఈ ముఠాల కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టయిన వారిలో 14 మంది నిందితులు ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌ల పేరు తో అధిక లాభాలు ఆశజూపి పెట్టుబడులు పెట్టించుకుని, ఆ తర్వాత డబ్బుతో ఉడాయించినట్లు తేలింది. మరో ఐదుగురు నింది తులు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పేరుతో ఏకం గా రూ.3 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు అధికారులు గుర్తించారు.
వీరి నుంచి భారీ మొ త్తంలో నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియ ని లింక్‌లను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని, సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు. అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.