calender_icon.png 18 May, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగులోకి ఏస్

18-05-2025 12:13:42 AM

విజయ్ సేతుపతి నుంచి ఓ సినిమా వస్తుందంటే మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని అంతా ఫిక్స్ భావిస్తారు. అలాంటి విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా అరుముగ కుమార్ తెరకెక్కించిన చిత్రమే ‘ఏస్’. ఈ సినిమా తెలుగు హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించుకుంది.

బీ శివప్రసాద్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. బీ శివప్రసాద్ దర్శక, నిర్మాణంలో ఇదివరకు ‘రా రాజా’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. తమిళం, తెలుగు భాషల్లో మే 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరణ్ సంగీతాన్ని అందించగా.. సామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సమకూర్చారు.